Friday, April 26, 2013

బహుబలి లో సత్యరాజ్...


రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కబోతున్న చిత్రం 'బాహుబలి' త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో తమిళ నటుడు సత్యరాజ్ కూడా నటించనున్నాడు. ఈ సినిమాలో సత్యరాజ్ ఓ వైవిధ్యమైన లుక్ లో కనిపిస్తాడట. ఈ సినిమాలో ప్రభాస్ రానా అనుష్కలవలె సత్యరాజ్ కూడా కత్తి యుద్దాలు గుర్ర్రపు స్వారీ శిక్షణ తీసుకుంటున్నాడు. అయితే ఇటీవల కాలంలో సత్యరాజ్ తెలుగులో నటించిన చిత్రాలలో ఇది రెండోది. మొదటిది ప్రభాస్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'మిర్చి' సినిమాలో హీరో తండ్రిగా నటించాడు. అలాగే ఈ సినిమాలో నాజర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మిగిలిన తారల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

No comments:

Post a Comment