వినోదాన్ని అందించడంలో స్టార్ హీరోలు ముందున్నారు. ఈ ఏడాది నాలుగు నెలల్లో సూపర్‌హిట్స్‌గా నిలిచిన నాలుగు చిత్రాలు ఈ యువహీరోలు నటించినవె కావడం విశేషం. యువతలో బ్రహ్మాండమైన ఫాలోయింగ్ ఉన్న మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్ నటిస్తున్న చిత్రాలకి మినిమం గ్యారంటీ ఉంటుందనే విషయం తెలిసిందే.
యువతరం మెచ్చి ఈ నలుగురు హీరోల స్థాయి సినిమా సినిమాకు మరింత పెరుగుతోంది. నాలుగు నెలల క్రితం వచ్చిన మహేష్‌బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రామ్‌చరణ్ నాయక్ కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి
. సీతమ్మ వాకిట్లో... లాంగ్‌రన్ రావాల్సి ఉన్నప్పటికీ, నిర్మాతకు సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఆశించిన సెంటర్లు రాలేదని అభిమానులు నిరాశచెందారు. యాభై రోజుల కేంద్రాలు కూడా తక్కువే. ఇద్దరు అగ్రహీరోలు ఉన్నప్పటికీ లాంగ్‌రన్ రాకపోవడం గమనార్హం. అయితే వ్యాపారపరంగా ఓపనింగ్స్ రాబట్టుకున్నాడు నిర్మాత. రామ్‌చరణ్ నాయక్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. మాస్ ఇమేజ్ ఉన్న హీరోల నుండి ప్రేక్షకులు ఆశించే అంశాలు ఏమిటనేదానికి మరోసారి సమాధానం దొరికింది. రచ్చ హిట్ తర్వాత చరణ్ నాయక్‌తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రభాస్ నటించిన మిర్చి, జూ.ఎన్టీఆర్ బాద్‌షా ప్రేక్షకుల ముందుకువచ్చాయి. ఈరెండు కమర్షియల్‌గా మంచి విజయాన్ని నమోదు చేశాయి. ఈ రెండు చిత్రాలు ఆయా హీరోల కెరీర్‌లో బిగ్‌హిట్స్ అని అంటున్నారు. రెబల్ పరాజయాన్ని మిర్చి మరిపించింది. ప్రభాస్‌కు కొత్తలుక్ ఇచ్చి, ఆయన మార్కెట్‌ను మరింత పెంచింది. ఇక జూ.ఎన్టీఆర్ బాద్‌షా అందరూ ఊహించినట్టుగానే భారీ ఓపనింగ్స్ రాబట్టింది.
ఎన్టీఆర్ స్టామినాకు ఈ చిత్రం అద్దం పడుతోందని వ్యాపారవర్గాలు అంటున్నాయి. ఇకముందు వచ్చే చిత్రాలపై అంచనాలు మరింత పెరుగుతాయి.
ఈ నలుగురు హీరోల చిత్రలు భవిష్యత్తులో వందకోట్ల క్లబ్‌కి చేరుకున్న ఆశ్చర్యం లేదు.
No comments:
Post a Comment