Friday, May 31, 2013

పెళ్లి ఎప్పుడో చెప్పిన ప్రభాస్......


ప్రభాస్ పెళ్లి మరో ఏడాదిలో జరుగుతుందని చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం గుడికి ఓ వివాహం లో హాజరయ్యేందుకు కృష్ణంరాజు దంపతులతో పాటు వచ్చినప్రభాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి ప్రభాస్ చెబుతూ " వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కుతున్నాను" అని తన మనసులో మాటను చెప్పాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కబోతున్న 'బాహుబలి' సినిమా కోసం పెద్దగా గడ్డం మీసాలు పెంచిన ప్రభాస్ ని చూడటానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. అతను అక్కడికి వస్తున్న విషయం ఎంతో జాగ్రత్తగా బయటకి పొక్కకుండా చూసుకున్నా ఎలాగోలా అభిమానులు తరలి వచ్చారు. అక్కడకు వచ్చిన అతని అభిమానులతో కలసి నవ్వతూ మాట్లాడి ఫోటోలు కూడా దిగాడు. అలాగే తన సినిమాల గురించి వారితో ప్రభాస్ కాసేపు సంతోషంగా గడిపాడు.

Wednesday, May 22, 2013

'బాహుబలి'లో నటించడం లేదు: రాజమౌళి



rajamouli Bahubali|prabhas bahubali|bahubali movie|anushka Bahubali
 
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు. ''తాను బాహుబలి లో నటించడం లేదని, ఈ ఫోటో మూడు సంవత్సరాలకు ముందు తీసింది. అప్పట్లో నేను సరదాగా నా గడ్డాన్ని ఆ స్టైల్లో మార్చుకున్నానని’' ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు.

Monday, May 20, 2013

రాజమౌళి 'బాహుబలి' కాదట...



తెలుగు చిత్రపరిశ్రమలో చాలాకాలంగా రాజమౌళి దర్శకత్వం వహించబోతున్న చిత్రం పేరు 'బహుబలి' గా ప్రచారం జరుగుతుంది. 'ఈగ' వంటి అధ్బుతమైన సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్దం చేసుకున్న సినిమా 'బాహుబలి'. ఇక అసలు విషయానికొస్తే రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాకి మొదటి నుంచి 'బాహుబలి' వర్కింగ్ టైటిల్ అనే చెబుతున్నాడు. కానీ ఈ సినిమా టైటిల్ అదే అని మీడియా తెగ ప్రచారం చేసింది. అయితే రాజమౌళి మాత్రం ఈ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాకి అతను 'మహా బలి' అనే టైటిల్ నిర్ణయించుకున్నాడని త్వరలో 'మహా బలి' అనే టైటిల్ ఫిల్మ్ చాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయిస్తాడని చిత్రవర్గాల సమాచారం. ఈ సినిమా కథకి 'బాహుబలి' అనే టైటిల్ కంటే 'మహాబలి' అనే టైటిల్ కచ్చితంగా సెట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ రానా అనుష్కలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Bahubali Vs Mahabali- A Title Dilemma


It is known news that S S Rajamouli is currently preparing to hit the floors with his magnum opus ‘Bahubali’. This has Prabhas as the hero while Anushka is the leading lady and Daggubati
Rana is the antagonist. However, the latest update is that some confusion is on about fixing the title of the film.
Though the title has kept been as ‘Bahubali’ some confusion has risen, as per sources. They say that in Sravana Belgola there is the Bahubali presence. And in case there is some trouble or protest coming from that region they might change the title with ‘Mahabali’. Some are saying there is also another reason.
Rajamouli has already scored hits with films starting with M such as ‘Magadheera’ and ‘Maryada Ramanna’. Moreover, ‘Mahabali’s impact is much stronger. Buzz is that due to media hype this ‘Bahubali’ title became famous. But now the talk is that chances of film being named as ‘Mahabali’ are high and already the title has been registered by the makers at the Film Chamber. Let us wait for the official announcement though.

Thursday, May 16, 2013

మిర్చి చిత్రం 28 కేంద్రాల్లో 100రోజులు.....




ప్రభాస్ హట్రిక్ హిట్ మిస్ అయినా....తన కెరీర్లో అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఆమధ్య ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం 28 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోనున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్లో ఎటువంటి హీరో సినిమా అయిన 100డేస్ పూర్తి చేసుకోవడం కష్టమే అని చెప్పుకోవాలి ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల్లో 100రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు చాలా తక్కవని చెప్పుకోవాలి. ఎంతో కష్టపడితే 50రోజులు పూర్తి చేసుకోవడం కష్టంగా ఉన్నది. సంక్రాంతికి విడుదలైన నాయక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు కుడా అత్యదిక థియేటర్లలో విడుదలైన 100 రోజులు ఆడిన సెంటర్లు మాత్రం చాలా తక్కువే. ఒకవేళ ఆడిన వాటిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. ఇక మిర్చి సినిమా ఈనెల 18 తో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా దాదాపు 28 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. ప్రాంతాల వారిగా ఎన్ని థియేటర్స్ లో వివరాలు...నైజం - 3 సీడెడ్ - 7 వైజాగ్ -2 వెస్ట్ -3 ఈస్ట్ -4 కృష్ణ 3 గుంటూరు 6. 

Mirchi Movie 100 Days Centres

 
 S. No  Area  Theatre
  NIZAM  
     
1 Hyderabad santhya35mm
2 Varangal venkatrama
3 Karimnagar mamatha
     
  Ceded  
     
4 Tirupati buma complex
5 Madanapalli asr movie land
6 Ananthapur tejaswini
7 Gudur akhileswari
8 Produtur bvs
9 Aadoni mini dwaraka
10 Karnool archana
     
  EAST  
     
11 Rajhamundry geethaapsara
12 Kakinada devi multiplex
13 Amalapuram venkatrama
14 Mandapeta krishna
     
  WEST  
     
15 Eluru sathyanarayana
16 Bheemavaram venkatarama
17 Palakollu dasari complex
     
  GUNTUR  
     
18 Guntur krishnamahal
19 Tenali veda
20 Ongole gorantla multiplex
21 Narsaraopeta chitralaya
22 Chilakaluripeta bhaskar delux
23 Vinukonda laxmi
     
  VIJAYAWADA  
     
24 Vijayawada annapurna
25 Machilipatnam ramaraj
26 Gudivada bommarillu
     
  VIZAG  
     
27 Gajuwaka srikanya
28 Vijayanagaram minerva

Wednesday, May 15, 2013

'Mirchi' 100 Days Centers

'Mirchi' 100 Days Centers
Young Rebel Star prabhas' 'Mirchi' is completing its 100 days run in 16 direct centers across the state on 18th of May. Given below are the area wise break up of number of direct centers of the movie.

AREA                    NO.OF DIRECT CENTERS
------------------         ------------------------
NIZAM                     04
CEDED                     01
KRISHNA                  02
GUNTUR                   04
VIZAG                      01
EAST GODAVARI       03
WEST GODAVARI      01

TOTAL                     16                    

Tuesday, May 14, 2013

రాజసం ఉట్టిపడేలా ప్రభాస్ లుక్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల గోపీచంద్ వివాహానికి హాజరై అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఇక్కడ ఆశ్చర్యానికి కారణం ప్రభాస్ రాజసం ఉట్టిపడే గ్రాండ్ లుక్ తో ఉండటమే. తన తర్వాతి సినిమా ‘బాహుబలి' కోసం భారీగా గడ్డం, కోరమీసాలు పెంచిన ప్రభాస్ అందరినీ ఆకట్టుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది. 


Saturday, May 11, 2013

'బాహుబలి 2' వస్తుందా...?



రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'బాహుబలి' సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదు...అప్పుడే రెండో పార్ట్ ఏంటి అని అనుకుంటున్నారా...? మరేం లేదండి 'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి తాయారు చేసుకున్న స్క్రిప్ట్ నిడివి చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందట. ఒకవేళ కట్ చేద్దామా అని అనుకుంటే సినిమాలో ఉన్న విషయం తగ్గుతుందని రాజమౌళి భయపడుతున్నాడు. దాంతో రాజమౌళి బాహుబలి రెండు భాగాలుగా తెస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ఈ బాహుబలి సినిమాలో ప్రభాస్ రానా అనుష్క లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Wednesday, May 8, 2013

Rebel Prabhas Highlight Action Climax


Rebel Prabhas Highlight Action Scene


Prabhas Sentiment Scene at Temple in Rebel


Rebel Prabhas Non Stop Highlight Action Scene

Rebel Prabhas interval fight



'బాహుబలి' షూటింగ్ ఈనెల 15 నుంచి...




ఎంతో కాలంగా హడావుడి చేస్తున్న 'బాహుబలి' చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ నెల 15 నుంచి సెట్స్ పైకి వెళుతుంది. ఈ సినిమా షూటింగ్ మొదట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనున్నది. ఈ సినిమాకోసం ఇప్పటికే హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ రూపొందిస్తున్నారు. ఈ సెట్ ను అంతర్జాతీయ స్థాయి కళా దర్శకుడు సాయి సిరిల్ అధ్వర్యంలో జారుతుంది. అయితే ఈ సినిమా వెయ్యో శతాబ్దం నాటి కథతో తెరకేక్కుతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ పృద్వీరాజ్ చౌహాన్ అనే రాజకుమారుడి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రభాస్ తమ్ముడి పాత్రలో రానా  యువరాణి లా అనుష్క నటిస్తున్నారు. ఈ సినిమాలో మొహమ్మద్ ఘోరీ దండయాత్రకి సంబంధించిన యుద్ద సన్నివేశాలు ఉంటాయట. ఈ సన్నివేశాలు సినిమాకి ఎంతో ప్లస్ అవుతుందని అంటున్నారు.


Monday, May 6, 2013

prabhas stamina


Prabhas Mirchi Total collections


Young Rebel Star Prabhas’s Mirchi had had a dream run at the box office. The film as we all know has performed very well even during the dry season and has crossed 40 Cr mark in only AP and collected more than 48 Cr worldwide.

Nizam – 14.60 Cr

Uttar Andhra – 4.27 Cr

Nellore – 1.69 Cr

Krishna – 2.75 Cr

East – 2.90 Cr

West – 2.68 Cr

Ceded – 7.54 Cr

Guntur – 3.72 Cr

Total Andhra Pradesh – 40.15 Cr

Mirchi Karnataka & ROI Share – 4.35 Cr

Mirchi Overseas [ USA, UK ] Share – 4.3 crore

Prabhas Mirchi Total Collections  – 48.8 crore share

Mirchi Sattelite rights were grabbed by Maa for a solid 6 crores

Mirchi dubbing rights in Hindi were sold for 2 crores.

Looking at the figures – Mirchi is a profitable venture for Prabhas team with more than 50 crores business for the movie.

Below are the Pre release business details for Mirchi movie. Distributors are most satisfied with this profit venture from Prabhas.

Nizam – 8.4 Cr, Krishna – 1.8 Cr, Guntur – Own Release, East – 1.9 Cr, West – 1.7 Cr, Uttar Andhra – 3.25 Cr, Nellore – 1.5 Cr, Ceded – 5.9 Cr, overseas – 2.3cr


స్పెషల్‌ లుక్‌లో ప్రభాస్‌


NewsListandDetails
రాజమౌళి దర్శకత్వంలో నటించడమంటే కేవలం రెండేళ్ల పాటు సమయం కేటాయించడమే కాకుండా.. జుట్టు, గడ్డం కూడా పెంచుకొని తిరగాలి. 'మగధీర' సమయంలో చరణ్‌ పొడవాటి జులపాలతో తిరిగేవాడు. ఇప్పుడు ప్రభాస్‌కి జుట్టుతో పాటు గడ్డం పెంచేభారం కూడా పడింది. 'బాహుబలి' షూటింగ్‌ ఇంకా మొదలు కాలేదు. ప్రభాస్‌ ఫైనల్‌ లుక్‌ ఏంటనేది ఇంకా నిర్ణయించలేదు. అయితే ప్రభాస్‌ మాత్రమే కాకుండా రాణా కూడా ఇలా కనిపిస్తాడు. ఇంకా ఈ చిత్రంలో అనేక మంది నటులు కూడా ఇదే రూపంతో కనిపించబోతున్నారు. ప్రభాస్‌, రానా హైట్‌కు మ్యాచ్‌ అయ్యే వారినే  ఏరికోరి రాజమౌళి ఎంపికచేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్క బోతోంది.

Thursday, May 2, 2013

రెమ్యూనరేషన్లో చిరు స్ట్రాటజీని ఫాలో అవుతున్న ప్రభాస్?

రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం చేస్తున్న ప్రభాస్...ఈ చిత్రం నుంచి రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి స్ట్రాటజీని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి నైజాం రైట్స్ ఎంత వస్తే అంత మొత్తాన్ని తన రెమ్యూనరేషన్ గా తీసుకునే వాడు.
ఇదే తరహాలో ప్రభాస్ ఓవర్సీస్ రైట్స్‌ను తన రెమ్యూనరేషన్ గా తీసుకోవాలని నిర్నయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు విడుదలైన ప్రభాస్ ‘మిర్చి' చిత్రం ఓవర్సీస్ లో భారీగా వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి' చిత్రానికి ఓవర్సీస్ రైట్స్ రూ. 10 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు.
 ఈ చిత్రంలో రాజు పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆయన ఇందులో రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. తాజాగా యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో మాజీ స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి లేదా సుస్మితా సేన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి లేదా సుస్మితాసేన్ ఈ చిత్రంలో ప్రభాస్, రాణా తల్లి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
 ఈగ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించనున్నాడు. ఇటీవల వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ ‘బాహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. అదే విధంగా తమిళ నటుడు సత్యరాజ్ కబ్బా అనే పాత్రకు ఎంపికయినట్లు తెలుస్తోంది. 
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.