తెలుగు చిత్రపరిశ్రమలో చాలాకాలంగా రాజమౌళి దర్శకత్వం వహించబోతున్న చిత్రం పేరు 'బహుబలి' గా ప్రచారం జరుగుతుంది. 'ఈగ' వంటి అధ్బుతమైన సినిమా తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్దం చేసుకున్న సినిమా 'బాహుబలి'. ఇక అసలు విషయానికొస్తే రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాకి మొదటి నుంచి 'బాహుబలి' వర్కింగ్ టైటిల్ అనే చెబుతున్నాడు. కానీ ఈ సినిమా టైటిల్ అదే అని మీడియా తెగ ప్రచారం చేసింది. అయితే రాజమౌళి మాత్రం ఈ టైటిల్ ను మార్చే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాకి అతను 'మహా బలి' అనే టైటిల్ నిర్ణయించుకున్నాడని త్వరలో 'మహా బలి' అనే టైటిల్ ఫిల్మ్ చాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేయిస్తాడని చిత్రవర్గాల సమాచారం. ఈ సినిమా కథకి 'బాహుబలి' అనే టైటిల్ కంటే 'మహాబలి' అనే టైటిల్ కచ్చితంగా సెట్ అవుతుందని రాజమౌళి భావిస్తున్నాడట. ఈ సినిమాలో ప్రభాస్ రానా అనుష్కలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. |
Monday, May 20, 2013
రాజమౌళి 'బాహుబలి' కాదట...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment