Thursday, May 16, 2013

మిర్చి చిత్రం 28 కేంద్రాల్లో 100రోజులు.....




ప్రభాస్ హట్రిక్ హిట్ మిస్ అయినా....తన కెరీర్లో అరుదైన రికార్డ్ సృష్టించాడు. ఆమధ్య ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం 28 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోనున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టాలీవుడ్లో ఎటువంటి హీరో సినిమా అయిన 100డేస్ పూర్తి చేసుకోవడం కష్టమే అని చెప్పుకోవాలి ఇటీవల కాలంలో విడుదలైన సినిమాల్లో 100రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు చాలా తక్కవని చెప్పుకోవాలి. ఎంతో కష్టపడితే 50రోజులు పూర్తి చేసుకోవడం కష్టంగా ఉన్నది. సంక్రాంతికి విడుదలైన నాయక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలు కుడా అత్యదిక థియేటర్లలో విడుదలైన 100 రోజులు ఆడిన సెంటర్లు మాత్రం చాలా తక్కువే. ఒకవేళ ఆడిన వాటిని వేళ్ళపై లెక్కపెట్టవచ్చు. ఇక మిర్చి సినిమా ఈనెల 18 తో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమా దాదాపు 28 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంటుంది. ప్రాంతాల వారిగా ఎన్ని థియేటర్స్ లో వివరాలు...నైజం - 3 సీడెడ్ - 7 వైజాగ్ -2 వెస్ట్ -3 ఈస్ట్ -4 కృష్ణ 3 గుంటూరు 6. 

No comments:

Post a Comment