Thursday, May 2, 2013

రెమ్యూనరేషన్లో చిరు స్ట్రాటజీని ఫాలో అవుతున్న ప్రభాస్?

రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చిత్రం చేస్తున్న ప్రభాస్...ఈ చిత్రం నుంచి రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి స్ట్రాటజీని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో చిరంజీవి నైజాం రైట్స్ ఎంత వస్తే అంత మొత్తాన్ని తన రెమ్యూనరేషన్ గా తీసుకునే వాడు.
ఇదే తరహాలో ప్రభాస్ ఓవర్సీస్ రైట్స్‌ను తన రెమ్యూనరేషన్ గా తీసుకోవాలని నిర్నయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు విడుదలైన ప్రభాస్ ‘మిర్చి' చిత్రం ఓవర్సీస్ లో భారీగా వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో ‘బాహుబలి' చిత్రానికి ఓవర్సీస్ రైట్స్ రూ. 10 కోట్ల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు.
 ఈ చిత్రంలో రాజు పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆయన ఇందులో రాజ్ పుత్ చక్రవర్తి పృథ్వీరాజ్ చౌహాన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రియురాలు సంయోగిత పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. తాజాగా యూనిట్ సభ్యుల నుంచి అందుతున్న సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో మాజీ స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి లేదా సుస్మితా సేన్‌ నటించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి లేదా సుస్మితాసేన్ ఈ చిత్రంలో ప్రభాస్, రాణా తల్లి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
 ఈగ సినిమాలో విలన్ పాత్ర పోషించిన కన్నడ నటుడు సుదీప్ ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రను పోషించనున్నాడు. ఇటీవల వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పంజా చిత్రంలో విలన్ పాత్ర పోషించిన అడవి శేష్ ‘బాహుబలి' చిత్రంలో కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. అదే విధంగా తమిళ నటుడు సత్యరాజ్ కబ్బా అనే పాత్రకు ఎంపికయినట్లు తెలుస్తోంది. 
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈచిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్ల నుంది. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. మరో వైపు ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమాకు సంబంధించిన సెట్టింగ్స్ వేసే పనిలో బిజీగా ఉన్నారు.

No comments:

Post a Comment