Friday, May 31, 2013

పెళ్లి ఎప్పుడో చెప్పిన ప్రభాస్......


ప్రభాస్ పెళ్లి మరో ఏడాదిలో జరుగుతుందని చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరం గుడికి ఓ వివాహం లో హాజరయ్యేందుకు కృష్ణంరాజు దంపతులతో పాటు వచ్చినప్రభాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి ప్రభాస్ చెబుతూ " వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కుతున్నాను" అని తన మనసులో మాటను చెప్పాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కబోతున్న 'బాహుబలి' సినిమా కోసం పెద్దగా గడ్డం మీసాలు పెంచిన ప్రభాస్ ని చూడటానికి అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. అతను అక్కడికి వస్తున్న విషయం ఎంతో జాగ్రత్తగా బయటకి పొక్కకుండా చూసుకున్నా ఎలాగోలా అభిమానులు తరలి వచ్చారు. అక్కడకు వచ్చిన అతని అభిమానులతో కలసి నవ్వతూ మాట్లాడి ఫోటోలు కూడా దిగాడు. అలాగే తన సినిమాల గురించి వారితో ప్రభాస్ కాసేపు సంతోషంగా గడిపాడు.

No comments:

Post a Comment