Saturday, May 11, 2013

'బాహుబలి 2' వస్తుందా...?



రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'బాహుబలి' సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదు...అప్పుడే రెండో పార్ట్ ఏంటి అని అనుకుంటున్నారా...? మరేం లేదండి 'బాహుబలి' సినిమా కోసం రాజమౌళి తాయారు చేసుకున్న స్క్రిప్ట్ నిడివి చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందట. ఒకవేళ కట్ చేద్దామా అని అనుకుంటే సినిమాలో ఉన్న విషయం తగ్గుతుందని రాజమౌళి భయపడుతున్నాడు. దాంతో రాజమౌళి బాహుబలి రెండు భాగాలుగా తెస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ఈ బాహుబలి సినిమాలో ప్రభాస్ రానా అనుష్క లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

No comments:

Post a Comment