Wednesday, May 8, 2013

'బాహుబలి' షూటింగ్ ఈనెల 15 నుంచి...




ఎంతో కాలంగా హడావుడి చేస్తున్న 'బాహుబలి' చిత్రం సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ నెల 15 నుంచి సెట్స్ పైకి వెళుతుంది. ఈ సినిమా షూటింగ్ మొదట హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకోనున్నది. ఈ సినిమాకోసం ఇప్పటికే హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ రూపొందిస్తున్నారు. ఈ సెట్ ను అంతర్జాతీయ స్థాయి కళా దర్శకుడు సాయి సిరిల్ అధ్వర్యంలో జారుతుంది. అయితే ఈ సినిమా వెయ్యో శతాబ్దం నాటి కథతో తెరకేక్కుతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ పృద్వీరాజ్ చౌహాన్ అనే రాజకుమారుడి పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ప్రభాస్ తమ్ముడి పాత్రలో రానా  యువరాణి లా అనుష్క నటిస్తున్నారు. ఈ సినిమాలో మొహమ్మద్ ఘోరీ దండయాత్రకి సంబంధించిన యుద్ద సన్నివేశాలు ఉంటాయట. ఈ సన్నివేశాలు సినిమాకి ఎంతో ప్లస్ అవుతుందని అంటున్నారు.


No comments:

Post a Comment