Thursday, August 15, 2013

రాజమౌళి సమక్షంలో కొట్టుకుంటున్న ప్రభాస్, రానా!


FILE
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి సమక్షంలో ప్రముఖ హీరోలు ప్రభాస్, రానాలు కొట్టుకుంటున్నారు. వీరికొట్టుడుకు బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం అంటున్నాయి సినిమా వర్గాలు. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న 'బాహుబలి' సినిమాలో పోరాట సన్నివేశాలు కోసం ప్రభాస్, రానాలు కత్తులు పట్టుకుని కొట్టుకుంటున్నారు.

విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన డైరెక్టర్ రాజమౌళి 'బాహుబలి' సెకండ్ షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభించాడు. ఈసినిమాలో హీరో ప్రభాస్, విలన్ రానాల మధ్య ఉన్న పోరాటాలను చిత్రీకరిస్తున్నారు.

సిక్స్‌ప్యాక్ బాడీలతో కనిపించే వీరిమధ్య యుద్ధం ప్రేక్షకుల గుండెలను అదరగొట్టడం ఖాయం అంటున్నాయి సినిమా వర్గాలు. మరో రెండు నెలలపాటు ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా సాగనుందని సినీవర్గాల సమాచారం.

No comments:

Post a Comment