Sunday, August 25, 2013

ప్రభాస్ 'బాహుబలి'...టెస్టింగ్ పీరియడ్ Read more at: http://www.weloveprabhas.com/

 ప్రభాస్ 'బాహుబలి'...టెస్టింగ్ పీరియడ్
ప్రభాస్‌, రానా, అనుష్క కాంబినేషన్ లో భారీ ఎత్తున రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' . ఈ చిత్రం షూటింగ్ రామౌజీ ఫిల్మ్ సిటిలో వేగంగా జరుగుతోంది. సినిమాకి సంభందించిన కీలకమైన సన్నివేసాలు ప్రత్యేకంగా వేసిన సెట్స్ తీస్తున్నారు. ఈ సీన్స్ లో భాగంగా ఫైట్స్ ని చిత్రీకరిస్తున్నారు. ఓ రకంగా ఇవి టెస్ట్ పిరియడ్ అంటున్నారు. గత కొంతకాలంగా తాము నేర్చుకున్న కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ, పోరాటాలు ఎంత వరకూ వంటబట్టిందో తెలిస్తుంది. ప్రభాస్‌, రానా, అనుష్క.. ముగ్గురూ తమ బలాబలాలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు. 'బాహుబలి' కోసం రాజమౌళి ప్రభాస్‌, రానా, అనుష్కకి కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీ, పోరాటాల విషయంలో చాలా రోజులు పాటు కఠోరమైన శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు వాటిని ప్రదర్శించి సినిమాని రక్తి కట్టించడానికి ఈ ముగ్గరూ సిద్ధమయ్యారు. 
 
ఫిల్మ్‌సిటీలో రూపొందించిన సెట్‌లో వీరిపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వీరికి ఇన్నాళ్లు శిక్షణ ఇచ్చిన రాజమౌళి ఫలితాల్ని పరిశీలిస్తున్నారు. ప్రభాస్ 'బాహుబలి'...టెస్టింగ్ పీరియడ్ ప్రభాస్ తొలి షెడ్యూల్ కర్నూలు ప్రాంతంలోని కొండ ప్రాంతంలో జరిగింది. తాజాగా రెండో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. సినిమా పూర్తయి ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్‌ సరసన అనుష్క హీరోయిన్‌గా నటిస్తుండగా రాణా ప్రభాస్ సోదరుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రభాస్ తల్లి పాత్రలో నటిస్తోంది. దర్శకుడు రమ్య కృష్ణకు చిత్రంలోని ప్రధాన కథను, ఆమె పాత్రలో విశిష్టతను చెప్పడంతో, దాదాపు కోటి రూపాయల పారితోషికాన్ని ఇవ్వజూపడంతో ఈ పాత్రను చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈచిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. అయితే హిందీ, మలయాళంతో పాటు ఇతర వీదేశీ భాషల్లోనూ విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ ప్రధాన భూమిక పోషించనున్నాయి. 
 
ఇండియన్ సినిమా చరిత్రలోనే గ్రేటెస్ట్ మూవీగా దీన్ని తీర్చిదిద్దేందుకు ట్రై చేస్తున్న రాజమౌళి....భారీ తారాగణాన్ని ఈ చిత్రం కోసం ఎంపిక చేస్తున్నాడు. ‘బాహుబలి' చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రమా రాజమౌళి కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. మగధీర, ఈగ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈచిత్రానికి కూడా పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ ఆధ్వర్యంలో సెట్స్ వేసారు.

No comments:

Post a Comment