Friday, August 30, 2013

ప్రభాస్ VS రామ్ చరణ్... రాజమౌళి "న్యూవండర్"....?

http://www.weloveprabhas.com/
టాలీవుడ్ సినీఇండస్ట్రీ అంటే సినీహీరోల్లో పోటీ ఉంటుంది. నెంబర్‌వన్ హీరో ఎవరు అనేదానిపై అభిమానుల్లో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. మెగా‌స్టార్ చిరంజీవి సినిమాలకు గుడ్ బై చెప్పిన తరువాత నెంబర్‌వన్ స్థానం కోసం పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు పోటీపడుతున్నారు. ఒకరి సినిమాల రికార్డులను ఇంకొకరు తిరగరాస్తూ నెంబర్‌వన్ అనిపించుకుంటున్నారు.

తాజాగా రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'బాహుబలి' న్యూ వండర్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నాయి సినీవర్గాలు. గతంలో రామ్ చరణ్ 'మగధీర'గా వచ్చి సంచలనం సృష్టించి బాక్సీఫీస్ రికార్డులను బద్దలకొట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదేతరహాలో మగధీర రికార్డును బ్రేక్ చేస్తానంటూ ప్రభాస్ 'బాహుబలి'గా వస్తున్నాడు. రాజమౌళి ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జేట్‌తో తెరకెక్కించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం బాహుబలి మొదటి షెడ్యూల్ షూటింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ఇంకా పవన్ 'అత్తారింటికి దారేది', రామ్ చరణ్ 'ఎవడు', ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా', మహేష్ బాబు '1 నేనొక్కడినే' సినిమాలు కూడా రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాయి. http://www.weloveprabhas.com/

No comments:

Post a Comment