Thursday, August 29, 2013

"బాహుబలి' షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.


ఒక్క ఫ్లాప్ కూడా కెరీర్లో లేని వరుస హిట్ల దర్శకుడు రాజమౌళి తాజాగా రూపొందిస్తున్న పిరియాడికల్ సినిమా 'బాహుబలి'. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ప్రభాస్ హీరోగా అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సోదరిడిగా రానా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ఆ చిత్ర ప్రొడక్షన్ టీం అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ''రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన మొదటి సెట్ పూర్తయింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది. ఈరోజు సినిమలో ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నాము" అని ట్విట్ చేశారు. అర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. పలుభాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.

No comments:

Post a Comment