Saturday, August 31, 2013

శరవేగంగా షూటింగ్‌లో 'బాహుబలి'


NewsListandDetails
ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ 'బాహుబలి'. ప్రభాస్‌, రానా, అనుష్క నటిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న ఈ మూవీ తాజాగా రెండవ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ మూవీని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం  తీసుకోవాలనుకున్న రాజమౌళి  సినిమాను వేగంగా పూర్తి చేస్తుండడం విశేషం. షూటింగ్‌ విశేషాలని రానా ట్విట్టర్‌లో తెలియజేస్తూ''ప్రతిరోజు ఉదయం 7 గంటలకే షూటింగ్‌ మొదలవుతోంది. రాత్రి పదిగంటల వరకూ సాగుతోంది. ప్రతి రోజు చాలా ఉత్సాహంగా ఉంటోం ది. గ్రేట్‌ టీమ్‌ వర్క్‌తో సినిమాను పూర్తిచేస్తున్నాము"అని ట్వీట్‌ చేశా డు. ఇక ఈ చిత్రాన్ని విభిన్నమైన కథాంశంతో సమ్‌థింగ్‌ స్పెషల్‌గా  తెరకెక్కిస్తున్నాడు ఎస్‌.ఎస్‌.రాజ మౌళి.  ఈ సినిమా టాలీవుడ్‌లో రికార్డులను తిరగరాస్తుందని అంటున్నారు.

No comments:

Post a Comment