'బాహుబలి' .. తెలుగు చిత్ర పరిశ్రమలో వందకోట్ల బడ్జెట్ దాటిన తొలి చిత్రం. సినిమా కోసం హీరో, హీరోయిన్ లకు దర్శకుడు అదిరిపోయే రెమ్యూనరేషన్ ఇస్తున్నాడని టాక్. దీనిలో ప్రభాస్ కు ఇరవైకోట్లు, అనుష్కకు రెండుకోట్లు ఇస్తున్నాడని టాలీవుడ్ సమాచారం. అయితే దర్శకుడు రాజమౌళి మాత్రం రెమ్యూనరేషన్ ఇచ్చే ముందు హీరోకు సినిమాకు సంబంధించిన కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఈ సినిమా పూర్తయ్యేంత వరకూ ప్రభాస్ వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకూడదనే రూల్ పెట్టాడు. దీని ప్రకారం ఎలా చూసినా ఈ రెండేళ్లలో ప్రభాస్ కచ్చితంగా రెండు, మూడు సినిమాలకు పైగా చేయగలడు. ఒక్కో సినిమాకు పదికోట్లు తీసుకున్నా, రెండేళ్లలో ముఫ్ఫై కోట్ల రెమ్యూనరేషన్ వస్తుంది. కానీ అవన్నీ పక్కనబెట్టి కేవలం రాజమౌళి కోసమే ఈ సినిమా చేస్తున్నాడని సినీ ప్రముఖులు చెబుతున్నారు. మరోవైపు అనుష్క చేతిలో ఈ సినిమాతో పాటు 'వర్ణ, రుద్రమదేవి'లాంటి భారీ ప్రాజెక్టులున్నాయి. అంటే ఆమె స్థాయిలో అనుకున్నదానికంటే ఎక్కువే సంపాదిస్తోంది. ఇక రాజమౌళి కూడా రైట్స్ రూపంలో భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటాడు. మరి ఈ విషయంలో ఎవరు కరెక్ట్ గా లాభపడతారనేది తెలిసినా .. క్రేజ్, ఇమేజ్ కోసమే సినిమా చేస్తున్నవారూ ఉన్నారు. సో ఇంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ బాహుబలి విడుదలయ్యాక కలెక్షన్ల వర్షం కురిపిస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి.
No comments:
Post a Comment