prabhas-baahubali
రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ‘బాహుబలి ది బిగినింగ్‌’గా పిలవబడుతున్న మొదటి భాగానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను మే 31న విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈలోగా ఈ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్తేజాన్ని పెంచడానికి సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన వారి పోస్టర్లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే బాహుబలి ఫస్ట్‌లుక్ పోస్టర్, శివుడు పాత్రలో నటించిన ప్రభాస్ పోస్టర్, దేవసాన పాత్రలో నటించిన అనుష్క పోస్టర్‌, శివగామిగా నటించిన రమ్యకృష్ణ పోస్టర్‌, కాళకేయగా నటించిన ప్రభాకర్ పోస్టర్, బిజ్జలదేవగా నటించిన నాజర్ పోస్టర్, కట్టప్పగా నటించిన సత్యరాజ్ పోస్టర్, అస్లామ్ ఖాన్‌గా నటించిన సుధీప్ పోస్టర్, అవంతికగా నటించిన తమన్నా పోస్టర్, భల్లాల దేవగా నటించిన రానా పోస్టర్ ఇలా ఒక్కో పోస్టర్‌తో సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ వరుసలో మిగిలిన ఒకే ఒక్క పోస్టర్ బాహుబలిగా నటించిన ప్రభాస్‌దే!
ఈ పోస్టర్‌ను ఈ సాయంత్రం విడుదల చేశారు. పోస్టర్లు రిలీజ్ చేయడం మొదలైన రోజు నుంచే బాహుబలి ప్రభాస్ పోస్టర్‌పై విపరీతమైన అంచనాలున్నాయి. ఆ అంచనాలన్నింటినీ నిజం చేస్తూ ఈ సాయంత్రం విడుదలైన పోస్టర్ స్టన్నింగ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. “సాహస విక్రమ ధీశాలి !రణతంత్ర కళా కుశలి !!” అంటూ బాహుబలి గుణగణాలను వర్ణిస్తూ విడుదలైన ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు మరింత ఊపందుకున్నాయి. ఇక బాహుబలి కొత్తగా చేసే సందడి చూడాలంటే ట్రైలర్ విడుదల వరకూ ఆగాల్సిందే!