Wednesday, October 31, 2012

Prabhas Mirchi For Fancy Price In US

Rebel star prabhas new spicy entertainer Mirchi is creating sensation in tollywood trade circles, Mrichi is said to be a well packaged commercial entertainer with all ingredients to the much delight of the producers they got fancy price of 2c in US.
Great india films has manged to get the US rights of Mirchi, interesting fact is mirchi sold at higher price that prabhas earlier venture Rebel which was sold at 1.5c

Tuesday, October 30, 2012

Prabhas at Brahmanandam Son Gautham Wedding






ప్రభాస్ ‘మిర్చి’ ఇంటర్వెల్‌లో హై ఓల్టేజ్ ఫైట్స్


హైదరాబాద్: ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘మిర్చి' . అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రభాస్ అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ముఖ్యంగా ఈచిత్రం స్టోరీలో ఇంటర్వెల్ లో ట్విస్ట్ ఉంటుందని, అదే విధంగా ఇంటర్వెల్ లో హై ఓల్టేజ్ ఫైటింగ్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది. కథకు ఇంటర్వెల్ సీక్వెన్స్ కీలకం కానుందని తెలుస్తోంది. అదే సమయంలో ఎంటర్ టైన్మెంట్స్ అండ్ కామెడీ ట్రాక్ కు కూడా సరైన ప్రాధాన్యం ఇస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు.

జనవరి 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఆడియో విడుదల కానుంది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయని తెలుస్తోంది. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణ సంస్థ: యు.వి.క్రియేషన్స్, నిర్మాతలు: వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి.

Monday, October 29, 2012

ప్రభాస్ ఫాదర్ వల్లనే బెంజికారెక్కా : మోహన్ బాబు

Mohan Babu About Prabhas
 కృష్ణం రాజు, సూర్యనారాయణరాజు కుటుంబంతో నా అనుబంధం విడదీయలేనిది, మా స్నేహం చాలా గొప్పది అని కూడా చెప్పదలిచాను తెలుసా..? తొలి సారి నేను ‘బెంజికారు' ఎక్కింది ప్రభాస్ వాళ్ల ఫాదర్ సూర్య నారాయణ రాజు కారులోనే అన్నారు మెహన్ బాబు. సోమవారం మోహన్ బాబు విలేకరులతో ఈ విషయం గుర్తు చేసుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. మోహన్ బాబు కుమారుడు విష్ణు హీరోగా రూపొందిన ‘దేనికైనా రెడీ' చిత్రం బుధవారం విడుదలవుతోంది. ఈ చిత్రంలో కేరక్టర్ డిమాండ్ మేరకు విష్ణు పాత్రకు కొన్ని చోట్ల ప్రభాస్ ‘డబ్బిండ్' చెప్పారు.
 
సినిమాలో ప్రభాస్ ను అనుకరించేలా విష్ణు పాత్ర అక్కడక్కడ నడుస్తుందట. దానికి గాను ప్రభాస్ ‘వాయిస్' ఇచ్చారు. ఫోన్ చేసి అడగ్గానే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఆప్యాయంగా వచ్చి డబ్బింగ్ చెప్పి వెళ్లాడు ప్రభాస్. అతనికి ‘థ్యాంక్స్' చెప్పడం ధర్మం అనుకుంటున్నాను. ప్రభాస్ పుట్టినరోజు మంగళవారం. ఈ సందర్భంలో అతనికి శుబాకాంక్షలు కూడా తెలుపుతున్నాను...అన్నారు మోహన్ బాబు.

ప్రభాస్ నటించిన బుజ్జిగాడు చిత్రంలో నేను నటించారు. మా ఇద్దరి మధ్య నెలకొన్న ఏ ఆప్యాయత మమ్మల్ని మూవ్ చేసిందో తెలియదు కానీ...నేను ప్రభాస్ ని ‘బావ' అని పిలుస్తాను. అతను కూడా నన్ను ‘బావ' అని పిలుస్తాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న కుర్రాడు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. సినిమా నటుడికి కావాల్సిన అన్ని లక్షనాలు అతనిలో ఉన్నాయి. అని మోహన్ బాబు చెప్పారు.

సూర్య నారాయణ రాజు బెంజికారులో తన వెళ్లిన సందర్భాన్ని మోహన్ బాబు గుర్తు చేసుకుంటూ...‘మా కుటుంబం చెన్నయ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వరంగల్ వెళ్లడానికి కారు కావలసి వచ్చి, సూర్య నారాయణ రాజుగారికి ఫోన్ చేస్తే ఆయన ఏకంగా బెంజికారు పంపించారు. అది చూసి షాక్ అయ్యాను. ఆయన అభిమానానికి. ఏదో కారు పంపుతారు అనుకున్నాను కానీ బెంజికారు పంపుతారు అనుకోలేదు. నేను బెంజి కారు ఎక్కడం నా లైఫ్ లో అదే తొలిసారి. అలాంటి మంచి మనసు, గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబం వారిది అన్నారు.

Wednesday, October 24, 2012

The twitter universe was flooded with birthday wishes for the rebel Star.



It's actor Prabhas's birthday today and the twitter universe was flooded with birthday wishes for the rebel Star. The actor turned 33 years old today. Here is what the Tollywood celebrities had to say to the birthday boy. Looks like he is called "darling" for a good reason!

Kajal Agarawal ? ?@KajalAgarawal Here wishing #Prabhas a Happy Birthday :)
Richa Gangopadhyay ?@richyricha Wishing a very happy birthday to my favoritest costar Prabhas!! Hv nvr met a hero so down to earth and funny! A pleasure to work with :)
Lakshmi Manchu ?@LakshmiManchu Happy birthday darling Prabhas :) U r awesome :) bestest wishes.
ileana dcruz ?@Ileana_Dcruz Happy birthday darling prabhas! Lots of love to u! Rock like a Rebel..
Vishnu Manchu ?@ItsVishnuManchu Many Happy returns of the day to 'Darling' Prabhas! Thank q dear brother for Dhenikaina Ready
Manchu Manoj ?@HeroManoj1 Happy birthday to my darling young rebel star :-) may u get married this year :-) lol :) god bless brother:-)
RAGHU KUNCHE ?@kuncheraghu Happy birthday to you "Darling Prabhas"???? .

Monday, October 22, 2012

Prabhas Birthday News



Prabhas Ro'KING' B'day Poster


Prabhas Mirchi Teaser Dialouge

Prabhas starer ‘Mirchi’ movie. Mirchi movie teaser will be released very soon and Prabhas will be saying a uttering dialogue “Nenu Theginchi Kodithe Thala Thegadaniki Talwar Kuda Avasaram Ledu. ” Prabhas dialogue delivery will definitely add more spice and it sure that fans will go crazy after listening to this dialogue in the theater.

Mirchi has Anushka Shetty and Richa Gangopadhyay as the leading ladies and Koratala Siva is the director. Devi Sri Prasad is composing the music and ‘Mirchi; is scheduled to be released in the month of January,2013.

ప్రభాస్‌ ‘మిర్చి' ఫస్ట్ లుక్ విడుదల




 ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ‘మిర్చి' టైటిల్ తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంతో రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఆదివారం నిర్మాతలు విడుదల చేసారు. ఈ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అదే విధంగా దీపావళికి టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు పాటలు, మూడు ఫైట్లు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 24 నుంచి యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రభాస్‌ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 'మిర్చి' అనే పేరును ఖరారు చేశాం. యాక్షన్‌ నేపథ్యమున్న కథే అయినా.. ఇందులో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్నాయి. ప్రభాస్‌ని ఒక కొత్త కోణంలో చూపించేలా దర్శకుడు కొరటాల శివ ఈ కథను తయారు చేసుకొన్నారు. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. 'మిర్చి'లాంటి కుర్రాడిగా ప్రభాస్‌ చేసే హంగామా అభిమానులకు నచ్చుతుంద''న్నారు. ఇటీవల ఇటలీలో తెరకెక్కించిన గీతాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దేవిశ్రీప్రసాద్‌ చక్కటి బాణీలు అందించారు. టెన్‌ కాశీలో కీలకమైన యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. మంగళవారం ప్రభాస్‌ జన్మదినం.

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ‘ ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రభాస్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందుతుంది' అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ... ‘కొరటాల శివ, నా స్నేహితుల కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలన్నీ వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారినిఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అన్నారు.

ఇక డిసెంబర్ నెలలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయని తెలుస్తోంది. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణం: యు.వి.క్రియేషన్స్.