రెబల్ చిత్రం
ఫెంటాస్టిక్ కలెక్షన్స్ కురిపిస్తోంది. ప్రభాస్ సినిమాలకు యూత్, ఫ్యామిలీ
ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ కు తోడు, ఆయన గత చిత్రాలు డార్లింగ్, మిస్టర్ పర్
ఫెక్ట్ చిత్రాలు మంచి విజయం సాధించడమే ఇందుకు కారణం. ‘రెబల్'చిత్రం తొలి 3
రోజుల్లో మంచి కలెక్షన్లు సాధించింది. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్
పెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘రెబల్' నిలిచింది.నైజాం ఏరియాలో
‘రెబల్' చిత్రం దాదాపు 250కిపైగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. ట్రేడ్
వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తొలి మూడు రోజుల్లో ‘రెబల్' చిత్రం
ఇక్కడ దాదాపు రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. అదే విధంగా సీడెడ్
ఏరియాలో రూ. 3.60 కోట్లు రాబట్టింది.
గుంటూరు, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి ఏరియాల్లోనూ ప్రభాస్ కు మంచి పాలోయింగ్ ఉంది. ఈచిత్రం గుంటూరులో రూ. 1.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.56 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.49 కోట్లు వసూలు చేసింది. అదే విధంగా వెస్ట్ గోదావరిలో రూ. 1.3 కోట్లు, కృష్ణలో రూ. 1.05 కోట్లు, నెల్లూరులో రూ. 78 లక్షలు చొప్పున తొలి మూడు రోజుల్లో వసూలు చేసింది.
అదే విధంగా ఏపి బయట కూడా ‘రెబల్' చిత్రానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కర్నాటకలో ఈచిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 1.35 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 75 లక్షలు, యూఎస్ఏలో రూ. 85 లక్షలు వసూలు చేసింది. టోటల్ గా ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 23.32 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

No comments:
Post a Comment