నిర్మాతలు మాట్లాడుతూ ''ప్రభాస్ ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని 'మిర్చి' అనే పేరును ఖరారు చేశాం. యాక్షన్ నేపథ్యమున్న కథే అయినా.. ఇందులో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలున్నాయి. ప్రభాస్‌ని ఒక కొత్త కోణంలో చూపించేలా దర్శకుడు కొరటాల శివ ఈ కథను తయారు చేసుకొన్నారు. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. 'మిర్చి'లాంటి కుర్రాడిగా ప్రభాస్ చేసే హంగామా అభిమానులకు నచ్చుతుంద''న్నారు. ఇటీవల ఇటలీలో తెరకెక్కించిన గీతాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. దేవిశ్రీప్రసాద్ చక్కటి బాణీలు అందించారు. టెన్ కాశీలో కీలకమైన యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కించబోతున్నాం. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. మంగళవారం ప్రభాస్ జన్మదినం.
దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ‘ ప్రభాస్ ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రభాస్ అభిమానుల అంచనాలకు అనుగుణంగా ఈ చిత్రం రూపొందుతుంది' అన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ... ‘కొరటాల శివ, నా స్నేహితుల కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రంలో కమర్షియల్ అంశాలన్నీ వుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. చిత్రం తప్పకుండా అన్ని వర్గాల వారినిఆకట్టుకుంటుందన్న నమ్మకముంది' అన్నారు.
ఇక డిసెంబర్ నెలలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి 11న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, పలు విజయవంతమైన చిత్రాలకు డైలాగ్ రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన టాలెంట్ ఏమిటో చూపించడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ ను గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్తలుక్ లో చూపించడంతో పాటు, కేక పుట్టించే డైలాగులు సినిమాలో వినిపించనున్నాయని తెలుస్తోంది. సత్యరాజ్, నదియా, బ్రహ్మానందం, ఆదిత్యమీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మది, ఆర్ట్: ఏఎస్ ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్‌కుమార్, నిర్మాణం: యు.వి.క్రియేషన్స్.
No comments:
Post a Comment