Monday, October 15, 2012

అన్ని భాషల్లో ప్రభాస్‌ చిత్రం?


NewsListandDetails
ఈగ సినిమాతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారు రాజమౌళి. ఈ నేపథ్యంలో త్వరలో  ప్రభాస్‌తో చేయబోతున్న చారిత్రక చిత్రాన్ని అన్ని భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు ముందే ప్లాన్‌ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల కథనం. దాదాపు వందకోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోందని తెలిసింది. డిసెంబర్‌లో సెట్స్‌పైకి రానున్న ఈ మూవీ కోసం హైదరాబాద్‌ శివార్లలోని ఓ 30 ఎకరాల స్థలంలో 10 కోట్ల బడ్జెట్‌తో ఓ భారీ సెట్‌ని నిర్మించబోతున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎవరు..ఇందులో హీరోయిన్‌ ఎవరు... మిగతా నటీనటలు వివరాలేంటి? అన్న విషయాలని త్వరలో దర్శకుడు రాజమౌళి తెలియజేస్తాడని చిత్ర వర్గాల సమాచారం. సో రాజమౌళి తీసే ఈ భారీ చిత్ర వివరాలకువెయిట్‌ అండ్‌ సీ.

No comments:

Post a Comment