Saturday, December 6, 2014

బాలీవుడ్ వెళ్తున్న ప్రభాస్


ప్రభాస్ మిర్చి సినిమా విడుదలై దాదాపు రెండు సంవత్సరాలు అవుతుండడంతో ప్రభాస్ నటిస్తున్న బాహుబలి సినిమా కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకొని కుర్చుతున్నారు. అయితే ప్రభాస్ చడీ చప్పుడు లేకుండా ప్రభాస్ నిన్న బాలీవుడ్లో విడుదలయిన సినిమాలో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. నిన్న శుక్రవారం నాడు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన యాక్షన్ జాక్సన్ సినిమాలో సోనాక్షి తో ఓ పాటలో కొన్ని క్షణాలపాటు కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.

తెలుగులో మహేష్ నటించిన దూకుడు సినిమాకి ఇది రీమేక్ గా తీసిన ఈ సినిమాని ప్రభుదేవా దర్శకత్వం వహించారు. అజయ్ దేవగన్ , సోనాక్షి , అమీ గౌతమ్ నటించిన ఈ సినిమాలోని ఓ పాటలో ప్రభాస్ కనిపించడం బట్టి చూస్తే…బాలీవుడ్లో కూడా తన హవా కొనసాగించాలని చూస్తున్నట్లు అర్ధం అవుతుంది. అన్నీ కుదిరితే బహుశా భవిష్యత్తులో ప్రభాస్ నటించబోయే తోలి సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా ప్రభాస్ ని వెండితెరపై చూడాలని తహతహలాడుతున్న ప్రభాస్ అభిమానులు యాక్షన్ జాక్సన్ సినిమాలో అతన్ని చూసి తృప్తిని పొందొచ్చు.

Tuesday, October 28, 2014

సర్ ప్రైజింగ్: మహేష్ బాబు మూవీలో హీరో ప్రభాస్



టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలం తరువాత ఫ్యామిలీ వాతావరణం కనిపిస్తుంది అన్నంతగా మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. మేటర్ లోకి వెళితే, టాలీవుడ్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే సరికొత్త ఈక్వేషన్స్ కలవబోతున్నాయి. మహేష్ బాబు హీరోగా మైత్రీ మూవీస్ నిర్మించే చిత్రం షూటింగ్ ఈ నెల 30 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. దీనికి 'మిర్చి' ఫేం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీలో హీరో ప్రభాస్ కి సంబంధించిన టాక్స్ ఫిల్మ్ నగర్ లో జోరుగా వినిపిస్తున్నాయి. 
'ఆగడు' పరాజయంతో మహేష్ తన సినిమాల స్క్రిప్టులపై కేర్ తీసుకోవడం మొదలెట్టాడు. ఆ క్రమంలో ఆయన చెప్పిన మార్పులు చేర్పులు దీనికి చేయడం జరుగుతుంది. అలాగే డైరెక్టర్ కొరటాల శివ కూడ మహేష్ మూవీకి సంబంధించిన ఇంట్రడక్షన్ లో హీరో ప్రభాస్ వాయిస్ పెట్టాలని మహేష్ కి సూచించాడట. అందుకు మహేష్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మూవీ అయిన జల్సాకి మాటలు ఇచ్చాడు. ఇప్పుడు మహేష్ మూవీకి ప్రభాస్ మాటలు ఇవ్వబోతున్నాడు. కొరటాల శివ దీనికి సంబంధించిన చర్ఛలను కూడ ప్రభాస్ తో జరిపినట్టు తెలుస్తుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్ లో ప్రభాస్ మాటలను వినొచ్చు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మహేష్ నవంబర్ 3 న ఈ సినిమా షూటింగులో జాయిన్ అవుతాడు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా దీనిని రూపొందిస్తున్నారు. మొత్తానికి ఈ న్యూస్ మాత్రం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటు మహేష్ బాబుకి, అటు ప్రభాస్ కి ఫిమేల్ ఫ్యాన్స్ ఎక్కువుగా ఉండటంతో వీరిద్దరి కాంబినేషన్ గా వస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ పై ఫ్యాన్స్ లోనూ ఆసక్తి పెరుగుతుంట. దీనికి సంబంధించిన విషయాన్ని చిత్ర యూనిట్ కొద్ది రోజుల్లోనే అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

bahubali birthday spl look



Superstar-young Rebel star’s secret meeting?

mahesh babu and prabhas imagesYes, you read it right. This secret meeting of Superstar Mahesh Babu and young Rebel star Prabhas is generating curiosity among film circles. As per our sources, it is learnt that Superstar Mahesh Babu met Prabhas to make a request. Here is the story… read on.
there are secret meetings between Mahesh Babu and Prabhas so as to use Prabhas voice as voice over to the upcoming project with Koratala Shiva. In the past, Pawan Kalyan’s movie Jalsa and Jr. NTR’s movie Baadshah voice over was given by Mahesh. Even Ravi Teja has given voice to the cycle in Maryada Rammana and really entertained the audience. So, this will be a treat to the audience listening the star voice on screen. So in the same intention Prabhas also being away from the screen for almost years may give a treat to his fans in this way.
The talks between the director and Prabhas are going on and even Mahesh seems really excited for this project! Even if star hero gives his voice for another star hero then it would be plus to the movie promotion as well. So ,will Prabhas say yes giving his fans a flick with his voice before Baahubali? Or no to only render things to Baahubali? Let’s wait and see for the official announcement of the deal. But surely this kind of relationship between star heroes is appreciable.

Sunday, September 14, 2014

రాజమౌళి... ప్రచార కేళి!


రాజమౌళి... ప్రచార కేళి!
సినిమా తీయడమే కాదు దాన్ని ప్రమోట్ చేయడంలోనూ దర్శకుడు రాజమౌళి స్టయిలే వేరు. తాను తెరకెక్కించిన సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి రేపేందుకు వైవిధ్య ప్రచారశైలి అనుసరించడం రాజమౌళి ప్రత్యేకత. గతంలో తాను రూపొందించిన అన్ని సినిమాల ప్రచారం విషయంలో ఇదే పంథా అనుసరించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' కోసం ఎప్పటికప్పుడు ప్రచార వ్యూహాలు రచిస్తున్నాడీ సక్సెస్ డైరెక్టర్.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రచార చిత్రాలు విడుదల చేసిన జక్కన్న మరో వెరైటీ ప్రమోషన్ కు సిద్దమయ్యారన్నది చిత్రనగరి సమాచారం. మహాబలేశ్వర్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత బాహుబలి చిత్ర యూనిట్ కు బ్రేక్‌ ఇచ్చాడీ సినిమా జక్కన్న. ఈ గ్యాప్‌లో బాహుబలి పబ్లిసిటీ కోసం 'క్రికెట్' ఆడిచేందుకు రాజమౌళి పథక రచన చేస్తున్నారని అంటున్నారని ఫిల్మ్‌నగర్‌ వాసులు.

ఫిలింనగర్ లో సమాచారం ప్రకారం ప్రభాస్, రానాల మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ ని ప్లాన్‌ చేస్తున్నాడట ఈ దర్శకధీరుడు. టాలీవుడ్ లోని యువ నటీనటులతో రెండు టీమ్స్ ను తయారు చేసి ఒకటి బాహుబలి టీమ్ గా, మరో జట్టును బల్లాల దేవ టీమ్ గా బరిలోకి దించనున్నాడు. ఈ రెండు జట్ల మధ్య లిమిటెడ్ ఓవర్ క్రికెట్ మ్యాచ్‌ని ప్లాన్ చేస్తున్నాడట. త్వరలో చాంపియన్స్ ట్రోఫి జరగనుంది. ఈ నేపథ్యంలో యూత్ ను కమ్ముకున్న క్రికెట్ ఫీవర్ ను క్యాష్ చేసుకునేందుకు రాజమౌళి ఈ వ్యూహం రచించాడట.సినిమాను శిల్పంలా మలచడంలోనే కాదు ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లడంలోనూ రాజమౌళి వినూత్నంగా ముందుకెళుతున్నాడు.

Tuesday, September 2, 2014

ప్రభాస్ కోసం మహేష్ బాబుకు మస్కా కొట్టింది!

 మహేష్ బాబు నటించిన 'ఆగుడు' మూవీ ఆడియో వేడుక ఆగస్టు 30న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఆడియో వేడుకకు హాజరు కావాల్సిన ముఖ్యమైన వ్యక్తుల్లో ఒకరైన హీరోయిన్ తమన్నా గైర్హాజరైంది. ఈ విషయం సినీ సర్కిల్‌లో చర్చనీయాంశం అయింది. విషయం ఆరా తీస్తే....తమన్నా గైర్హాజరు వెనక ప్రభాస్ ఉన్నాడని తేలింది. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'బాహుబలి'లో ప్రభాస్ సరసన తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'బాహుబలి' షూటింగ్ మహాబలేశ్వర్‌లో జరుగుతోంది. దీంతో 'ఆగడు' ఆడియో వేడుకకు హాజరయ్యే పరిస్థితి లేకుండా పోయింది. సో...అలా ప్రభాస్ సినిమాలో నటించడం కోసం మహేస్ బాబు 'ఆగడు' ఆడియో వేడుకకు మస్కా కొట్టింది తమన్నా.
ప్రభాస్ కోసం మహేష్ బాబుకు మస్కా కొట్టింది!
ఆగడు సినిమా విషయానికొస్తే....'దూకుడు' వంటి భారి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్ కాంబినేషన్లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులలో భారి అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tuesday, June 3, 2014

ప్రభాస్ అంబాసిడర్ ఆలోచన రాజమౌళిదా !

prabhas-rajamouli

మన స్టార్ హీరోలందరూ ఏదో ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ నాలుగు డబ్బులు వెనకేసుకోవడమే కాక తమ మార్కెట్ ని కూడా పెంచుకుంటున్నారు. ఒక్క పవన్ కళ్యాణ్ , ప్రభాస్ తప్ప పరిశ్రమలో మిగిలిన వారందరు ఏదో ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నవాళ్ళే , వీళ్ళలో మహేష్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఏకంగా జాతీయ స్థాయిలో కూడా మహేష్ నే బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రభాస్ కూడా ఇటువైపు వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అసలే ఓ వైపు సర్జరీ మరో వైపు బహుబలితో సతమతమవుతున్న మళ్ళీ పైన ఈ ప్రచారం కూడానా అనుకుంటూ ప్రభాస్ తనను సంప్రదించిన సంస్థలను వెనక్కు పంపిస్తూ వచ్చాడట. అయితే సాక్షాత్తు జక్కన్నే ప్రకటన పట్ల ప్రభాస్ ని బలవంతం చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ఎందుకంటే ప్రకటనలో కనిపిస్తే ఎంతోకొంత మార్కెట్ పెరుగుతుందని రాజమౌళి వాదన. అది కూడా నిజమే కనుక ప్రభాస్ కూడా ఇప్పుడు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. జక్కన్న తన బాహుబలి సినిమాని ఎలాగైనా ఇండియాలో అన్ని భాషల్లో విడుదల చేయాలనే తపనలో ఉన్నాడు. ఇప్పటికే తెలుగు , తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా హిందీ , కన్నడ , మలయాళంలో కూడా డబ్ చేయాలనీ చూస్తున్నారు. ముందుగా ప్రకటనలతో ఆ బాషలలో కూడా ప్రభాస్ ని పరిచయం అయితే తన సినిమాకి మార్కెట్ ఉంటుందని రాజమౌళి ప్లాన్!

Wednesday, April 30, 2014

బాహుబలి తర్వాత ప్రభాస్ ఉగ్రం ?




వేరే ఏ బాషలోనైనా ఏదైనా సినిమా విజయం సాధిస్తే ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం ఇతర బాషా సినిమాల దర్శక, నిర్మాతలు, హీరోలు పోటీ పడటం సాధారణ విషయమే. ఇపుడు మన తెలుగు టాప్ హీరోలు కూడా ఓ కన్నడ సినిమా గురించి పోటీ పడుతున్నారు.
ఇటీవలే కన్నడ బాషలో "ఉగ్రం" అనే చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని టాలీవుడ్ దర్శక,నిర్మాతలు పోటీ పడుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నాడని తెలిసింది. ఈ రీమేక్ లో హీరోగా ప్రభాస్ నటించనున్నాడని తెలిసింది. ప్రస్తుతం "బాహుబలి" చిత్ర షూటింగ్ లోఉన్న ప్రభాస్ ఈ చిత్రం తర్వాత కన్నడ రీమేక్ లో నటించనున్నాడని సమాచారం. ఈ రీమేక్ కు సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Tuesday, April 29, 2014

Dil Raju makes movie with Prabhas !

Dil Raju makes movie  with Prabhas !
Creative and Noted producer Dil Raju is now wanted to team up with rebel star Prabhas in the forthcoming remake of Ugram starring Hari Priya. It is known fact that Dil Raju has bagged the rights of the Ugram movie and wants Prabhas to act in the movie. Earlier Young Tiger Jr.NTR and Stylish hero Allu Arjun showed the interest in the movie but could not but Prabhas got the chance. Now it is the movie of Dil Raju and Prabhas movie already the movie is going to remake in Hindi with Bollywood hero Salman Khan.

Monday, April 7, 2014

బాహుబలి యుద్ధం పుర్తయింది !


రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి'. గత రెండు నెలలుగా ఈ చిత్ర యూనిట్ బాగా కష్టపడుతుంది. ఉదయం ఐదున్నర కు సెట్ కి రావాలి. సాయంత్రం ఆరు గంటలకు వరకు యుద్ధం చేయాలి. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అగ్ర నటుల వరకు అందరికీ ఇదే పని. మొత్తంగా రెండు వేళా మంది ఆర్టిస్టులపై రెండు నెలలుగా యుద్ద సన్నివేశాలు రుపొందిస్తున్నారట. రాజమౌళి భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ ఖర్చుతో కూడుకున్న సన్నివేశాలు ఇవేనట. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ సన్నివేశాలు రూపొందిస్తున్నారు. తాజాగా ఆ షెడ్యుల్ పూర్తయిందని రాజమౌళి ట్విట్ చేశారు. వైజాగ్ నుంచి వచ్చిన జిమ్ బాయ్స్ కి రాజమౌళి ప్రత్యేకంగా క్రుతజ్ఞాతలు చెప్పారు. వాళ్ళు లేకపోతె మేము ఏమి చేసేవాళ్ళం కాదని అన్నారు. ఉదయం ఐదున్నర గంటలకు వచ్చి వాళ్ళ మేకప్ వాళ్ళే వేసుకొని కష్టపడ్డారని అన్నారు రాజమౌళి దాదాపు 15౦ కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం ఇది. ప్రభాస్ రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క తమన్నా హీరోయిన్లు. అర్కామీడియా పతాకంపై కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

Sunday, March 30, 2014

రాత్రిళ్లు ఫుల్ బిజీగా రాజమౌళి, ప్రబాస్

రాజమౌళి,ప్రబాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం 'బాహుబలి'. ఈ చిత్రం షూటింగ్ గత కొంతకాలంగా రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం నైట్ ఎఫెక్ట్ సీన్స్ తీస్తున్నారు. అందుకోసం రాజమౌళి రాత్రిళ్లు షూటింగ్ పెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. ఎండలకు మండిపోకుండా రాత్రిళ్లు చేయటం హ్యాపీగా ఉందని అంటున్నారు. 
 
 రాజమౌళి ట్వీట్ చేస్తూ..."గత కొంతకాలంగా ఎండలో షూటింగ్ చేస్తూ వచ్చిన మాకు రాత్రివేళ ఓపెన్ ఎయిర్ లో,చల్లటి వాతావరణంలో, నైట్ సీన్ చేయటం చాలా బాగుంది..;) "అన్నారు. 
 
రాత్రిళ్లు ఫుల్ బిజీగా రాజమౌళి ఇక 'బాహుబలి' కోసం ఓ భారీ యుద్ధాన్ని తెరపై దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో కొన్నిటిని బ్లూ మ్యాట్ పై చిత్రీకరిస్తున్నారు. తెలుగు తెరపై ఇప్పటివరకూ చూడనివిధంగా ఉండాలని ఈ యుద్దం సన్నివేశాలను విదేశీ నిపుణుల సమక్షంలో తెరకెక్కిస్తున్నారు. సెకండాఫ్ లో వచ్చే ఈ యుద్దం సినిమాకి హైలెట్ అని చెప్తున్నారు. దీనికి ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహిస్తారు. 
 
 ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంతో పాటు రెండు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులపై యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దీనికోసం ఆరు నెలలు నుంచి చిత్రబృందం ప్రత్యేకంగా సన్నద్ధమై ముందుకు వెళ్తోంది. రెండు వేల మంది కళాకారులకు ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. ఆ సన్నివేశాలను రామోజీ ఫిల్మ్‌సిటీలో రెండు నెలల పాటు చిత్రీకరించనున్నారు.
 
 ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

Saturday, March 29, 2014

PRABHAS Baahubali night shoot starts...


Rajamouli's Baahubali night shoot starts
Young Rebel star Prabhas is currently busy with his upcoming periodic action adventure‘Baahubali’. For the past many months, the movie makers have been working at Ramoji Film City for a war sequence. This shoot is now coming to an end.

The latest buzz is that the movie unit is going to shoot some night effect scenes for the movie. Director SS Rajamouli posted in Twitter ‘After shooting in blazing suns for the past few months, canning a night scene, tonight. Open air, cool breeze.

Hope we don’t doze off..;) ‘. Rana Daggubati is playing other lead role. Tamanna and Anushka are playing female lead roles. Arka media banner is producing the movie. MM Keeravani is scoring the music for the movie. The movie is expected to release in 2015. 

Friday, March 28, 2014

ఉగ్రరూపం దాల్చనున్న ప్రభాస్‌... అతడే కరెక్ట్ అంటూ ఆఫర్..


prabhas


ఉగ్రుడు, రౌద్రుడు వంటి పాత్రలు పోషించగల నటుల్లో కృష్ణంరాజును చెప్పవచ్చు. ఆయన వారసునిగా ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్నాడు. ఛద్రపతిలో అతని టాలెంట్‌ మనం చూసిందే. ఇప్పుడు రాజమౌళి బాహుబలితో మళ్ళీ అంతటి ఉగ్రరూపం చూపించబోతున్నాడు. ఈ చిత్రం ఇంకా ఏడాది పట్టేట్టుంది.

తాజాగా ఓ తమిళ చిత్రం 'ఉగ్రమ్‌' విడుదలైంది. మంచి కలెక్షన్లు కురిపించింది. ఇందులో శ్రీమురళి, హరిప్రియ నటించారు. ఈ చిత్రం రీమేక్‌ చేయడానికి పెద్ద నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. ఈ పాత్రకు ప్రభాస్‌ కరెక్ట్‌ అని భావించారట.

ఈ పాత్ర కోసం ముందుగా వేరే యూత్‌ హీరోను అనుకున్నా... ప్రభాస్‌ ఎత్తు కరెక్ట్‌గా ఎమోషన్‌కు సరిపోతుందని భావించారట. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దర్శకత్వం వహించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Monday, March 24, 2014

Thamannah attending training sessions for Bahubali




Tamannah Bhatia is the cute and bubbly actress and she is going to appear as the lead actress in prestigious project ‘Baahubali’ very soon. Anushka will be seen as the heroine for one of the parts while Tamanna will be seen as the heroine for the other part as per the information from the film unit. Thamannah is yet to join the shoot.

She will be taking part in the the second half of this year and sources say that she is preparing herself for this big project by attending some training sessions. She is currently participating the shoot of Aagadu and she will be leaving them and soon will join Bahubali team.

Wednesday, March 12, 2014

Prabhas to share No.1 position with Mahesh?


Prabhas to share No.1 position with Mahesh?
After Pawan Kalyan, Mahesh and Jr.NTR are in the next 2 positions in Tollywood film industry. In the recent times, Jr.NTR lost his position due to series of flops. On the other hand, Prabhas is silent in Tollywood from the past 1 year as he is busy with “Bahubali”.

In fact, “Bahubali” may take Prabhas to No.1 position in Tollywood. Frankly speaking, Prabhas may even cross Pawan’s image with “Bahubali”. Hence, the future competition in Tollywood may be concentrated between Mahesh and Prabhas. If Pawan is in the arena, we can expect Prabhas to share the No.1 position with Pawan as Mahesh lost a part of his fame due to “One” talk.

But as Pawan is shifting his base to politics, Mahesh may share No.1 position with Prabhas in near future. Pawan’s absence is indirectly giving way to Prabhas to rule the Tollywood film industry. If Mahesh fails to prove himself with “Aagadu”, Tollywood may go into the grip of Prabhas!

Friday, February 21, 2014

చివరి దశలో 'బాహుబలి' యుద్ద సన్నివేశం !



పరాజయం ఎరుగని టాలీవుడ్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న చిత్రం 'బాహుబలి' ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ సినిమా కు సంబందించిన ఓ భారీ యుద్ద సన్నివేశం గత కొన్ని నెలలుగా అక్కడ చిత్రీకరణ జరుగుతుంది. దాదాపు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో తెరేక్కుతున్న ఈ యుద్ద సన్నివేశం ప్రస్తుతం ఓ కొలిక్కి వచ్చింది. ప్రభాస్ రానా హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెంథిల్ సాబు సైరిల్ కీరవాణి వంటి దిగ్గజాలు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మరో తెలుగు సినిమా తెరకేక్కించని విధంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి

Tuesday, February 11, 2014

ప్రభాస్ కు నిశ్చితార్ధం జరిగిందా !



తెలుగులో మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ జాబితాలో గోపీచంద్ ప్రభాస్ ఉండేవారు. గోపీచంద్ పెళ్లి జరిగిపోవడంతో ప్రభాస్ ఒక్కడే మిగిలిపోయాడు. ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత పెళ్లి కొడుకు కాబోతున్నట్లు ఆమధ్య కృష్ణం రాజు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈమధ్య ప్రభాస్ కొసం ఓ అమ్మాయిని చూశారని భీమవరం అమ్మాయి అని ప్రచారంజరిగింది. అయితే ఇప్పుడు ఎక్నగా ప్రభాస్ కు నిశ్చితార్ధం కూడా జరిగిందని ఫిల్మ్ నగర్లో మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ విషయం పై నుంచి ఒక్కరు కూడా ప్రభాస్ ఫ్యామిలీ  నుంచి కానీ సినిమా వర్గాల నుంచి ఎటువంటి సమాచారం లేదు. కానీ చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ప్రభాస్ ఫ్యామిలీ దగ్గరి బంధువుల అమ్మయితోనే ఎంగేజ్ మెంట్ అత్యంత నిరాడంబరంగా కేవలం సన్నిహితుల మధ్యనే జరిగిందని త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఘనంగా ఏర్పాటు చేయనున్నారని దానికి సంబందించిన తేది అఫీషియల్ గా ప్రకటన రానున్నది. అయితే అధికారికంగా సమాచారం లేని ఈ వార్తలను నమ్మాలో వద్దో అర్ధం కాక అభిమానులు తికమకపడుతున్నారు.

Saturday, February 8, 2014



Bahubali Motion Poster in comic con


Bahubali Motion poster will be displayed in Comic con event which will be held on sunday in NewDelhi.
Comic Con is a platform for comic artists, publishing companies and toy manufacturers to showcase their work!  This is one of the new appearance in the Bahubali promotion.
Below Video Shows how the Bahubali motion print will be.

Saturday, February 1, 2014

యంగ్ రెబల్ స్టార్ పై వర్మ కన్ను!



ఒకప్పుడు రాంగోపాల్ వర్మను గొప్ప దర్శకుడు అని పొగిడిన వారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన్ను చాలామంది చెత్త సినిమాల దర్శకుడు అని విమర్శిస్తున్నారు. హిట్ బాటలో ఉన్నంతకాలం మంచి పేరు...ఫ్లాపుల బాటలోకి వచ్చాక చెత్తపేరు చిత్ర రంగంలో సాదరణమే. ఇటీవల అటు హిందీలోనూ...ఇటు తెలుగులోనూ రాంగోపాల్ వర్మ తీసిన సినిమాలు నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చి పెట్టాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనతో సినిమాలు చేయాలంటే నిర్మాతలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే అటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది. అదేమిటంటే రాంగోపాల్ వర్మ ఓ పొలిటికల్ సెటైర్ మూవీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఆ సినిమాలో ప్రభాస్ హీరోగా వర్మ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. వర్మ కెరీర్లో మొదటిసారిగా అత్యధికంగా 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాకి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో వర్మతో పెద్ద రిస్క్ చేస్తున్న నిర్మాత ఎవరో పక్కకు పెడితే....ప్రభాస్ తన కెరీర్లో వర్మ చేతిలో పెట్టి రిస్క్ చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో నటిస్తున్నాడు. ప్రభాస్ అనుష్క రానా తమన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నది.

Thursday, January 30, 2014

అవ‌న్నీ పుకార్లే అంటున్న జ‌క్కన్న!!

అవ‌న్నీ పుకార్లే అంటున్న జ‌క్కన్న!!రాజ‌మౌళి `బాహుబ‌లి`లో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడు, సునీల్ కూడా ఆ చిత్రంలో ప్రతినాయ‌కుడిగా న‌టిస్తున్నాడు, 
ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి రాజ‌మౌళి ఓ క‌థ చెప్పాడు, వీరిద్దరి క‌ల‌యిక‌లో త్వర‌లోనే ఓ సినిమా ఉంటుంది. 

 గ‌త కొన్ని రోజులుగా ఫిల్మ్‌న‌గ‌ర్‌లో సాగుతున్న ప్రచారమే ఇదంతా. అయితే ఆ ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టే ప్రయ‌త్నం చేశారు రాజ‌మౌళి. ట్విట్టర్ ద్వారా ఆయ‌న చెబుతూ... `బాహుబ‌లి`లో తార‌క్ భాగ‌మ‌య్యార‌న్నది అవాస్తవం. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి కూడా నేను క‌థ చెప్పలేదు. సునీల్ `బాహుబ‌లి`లో న‌టిస్తున్నాడ‌న్న మాట కూడా అబ‌ద్ధం. ఇవ‌న్నీ పుకార్లే` అని స్పష్టం చేశారు.  

ప్రస్తుతం `బాహుబ‌లి` చిత్రీక‌ర‌ణ రామోజీ ఫిల్మ్‌సిటీలో సాగుతుంది. యుద్ధం నేప‌థ్యంలో స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఫిబ్రవ‌రి నెలాఖ‌రు వ‌ర‌కు ఆ స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌బోతున్నట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని వ‌చ్చే యేడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అయితే ఇంకో ఆర్నెళ్ల లోపు సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేస్తారు. ఆ త‌ర్వాత గ్రాఫిక్స్‌కి సంబంధించిన ప‌నుల‌ను మొద‌లుపెడ‌తారు. ఈ సినిమాకి విజువ‌ల్ ఎఫెక్ట్స్ అందించ‌డానికే ఆర్నెళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని తెలుస్తోంది.


Wednesday, January 29, 2014

అతనికి ప్రభాస్ 'బావ' అవుతాడట !


కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే బాగా ఇష్టమట. అందుకే ప్రభాస్ ని బావ అని పిలుచుకుంటారట. దీని గురించి స్వయంగా మోహన్ బాబు మాట్లాడుతూ " నేటి హీరోలలో ఎవరి స్టైల్ వారిది. అయితే అందరిలోకి నాకు మాత్రం ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఇద్దరం ఒకరినొకరం 'బావా బావా' అని పిలుచుకుంటాం" అని చెబుతున్నాడు మోహన్ బాబు. కాగా ఈ నెలాఖరున విడుదలవుతున్న 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా ద్వితీయార్ధనికి తన తనయుడు మనోజ్ తన భుజస్కందాలపై మోశాడని ఆయన చెప్పారు. " మా అబ్బాయని చెప్పడం లేదు. ఈ సినిమాలో మనోజ్ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ఆడవేషం అధ్బుతంగా చేశాడు. నర్తనశాల సినిమాలో అన్నగారు ఎన్టీఆర్ పోషించిన బృహన్నల పాత్ర ఆయనకు ఎంతటి పేరు తెచ్చిందో ఈ సినిమాలో ఆడవేషం కూడా మనోజ్ కి అతంటి పేరు తెస్తుంది అంటూ తన తనయుడిని మోసేశాడు.

Tuesday, January 28, 2014

ప్రభాస్ భారీ ఫాలోయింగ్ !


రెబల్ స్టార్ ప్రభాస్ కి క్రేజ్ ఎంత ఉన్నదో మనకు తెలియాలంటే అది చూడాల్సిందే. అది అంటే ఏమిటంటే...ప్రభాస్ మూడు నెలల క్రితం పేస్బుక్ లో ఎకౌంటు ఓపెన్ చేసిన విషయం తెలిసిందేఅయితే పేస్ బుక్లో ప్రభాస్ ఫాలో అయ్యేవారి సంఖ్యా 1 మిలియన్ మార్క్ ని దాటేసిందట. ఎకౌంటు ఓపెన్ చేసి 100 రోజుల లోపే ప్రభాస్ 1 మిలియన్ మార్క్ ని చేరుకోవడం చూస్తుంటే రెబల్ స్టార్ కి ఎంత క్రేజ్ ఉనందో అర్ధం అవుతుంది కదా. ఇంకా  ప్రస్తుతం ప్రభాస్ 'బాహుబలి' సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. రాజమౌళి సినిమా చరిత్రలో ఇప్పటివరకు ఏ సినిమాలో చేయని విధంగా 'బాహుబలి' లో యుద్ద సన్నివేశాలను రుపొందిస్తున్నారట. అనుష్క రానా తమన్నా తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు

Prabhas Crossed a Milestone


Prabhas Crossed a Milestone

Young Rebel Star prabhas has joined the social networking media facebook last year. the crazy hero in no time, got the likes of lakhs of fans. And recently, he crossed the landmark 1 million likes on his facebook account. With this feat he stands next after Allu Arjun and Ram Charan in facebook fans likes. Likely he can achieve many more facebook records in near future.

prabhas is doing the protagonist of the costliest movie of tollywood, 'Baahubali'. Rana, Anushka, Tamanna, Ramya Krishna are the other lead star cast of the movie. SS Rajamouli is directing this movie on Arka Media Works. Meanwhile, prabhas is also expected to do the movie 'Okka Adugu' to be directed by his uncle Krishnam Raju this year.

Friday, January 24, 2014

ప్రభాస్ భార్య ఫైనలజ్ !


 
ప్రభాస్ పెళ్ళికి సంబందించిన చర్చ పరిశ్రమలో గతకొన్ని రోజులుగా జరుగుతుంది. దీనిపై ప్రభాస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు కానీ అతని పెళ్లి టాక్ అఫ్ ది టౌన్ అయింది. అయితే తాజాగా తన పెళ్ళికి లైన్ క్లియర్ అయిందని తెలుస్తుంది. ప్రభాస్ కుటుంబం ఓ అమ్మాయిని చూసినట్లు తెలుస్తుంది. భీమవరం ధనిక కుటుంబానికి చెందిన ఓ అమ్మాయిని అతని కుటుంబ సభ్యులు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఇద్దరి కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయట. పెళ్లి కూతురు తండ్రి పెద్ద రొయ్యల వ్యాపారి అని తెలుస్తుంది. ఇదిలా ఉంటే....ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న  బాహుబలి సినిమా పూర్తయిన తర్వాతే ప్రభాస్ పెళ్లి ఉంటుందట. బాహుబలి విడుదలకు ముందే ఎంగేజ్మెంట్ ప్రోగ్రాం చేస్దామని ప్రభాస్ కుటుంబం వధువు కుటుంబాని అడిగారట. ఇదే విషయాన్నీ తన పెద్ద నాన్న కృష్ణం రాజు తన పుట్టినరోజు అధికారికంగా చెప్పిన విషయం తెలిసిందే. సో ప్రభాస్ ఓ ఇంటివాడు కావడానికి మరో ఏడాది ఉన్నదనమాట .

Sunil joins Bahubali

 Ace director Rajamouli's Bahubali is progressing at brisk pace. Filmmakers are caning historic war sequences in extravagantly laid sets in Hyderabad.

 Rajamouli already roped in high profile star cast in the film which includes Rebel Prabhas,Leader Rana,Sweety Anushka and Milky Beauty Tamanna. Ramyakrishna is playing the role of Rajmata in the film which stars even Nasar Satyaraj,Adivi Sesh,Sudeep. 

 According to the latest hero cum comedian Sunil joined Bahubali team. Sources say when Rajamouli asked Sunil to do an important role in the film,Sunil was overwhelmed. Sunil at once gave green signal without any second thoughts. It was Rajamouli who turned Sunil into hero with film like Maryada Ramanna. 

 Keeravani is the music director for the film produced on Arka Media banner. Film stars Prabhas in dual roles as Sivudu and Bhaubali while Rana is seen as Bhallaladeva.